National

సైబర్ అటాక్..డార్క్‌వెబ్‌లో ఎస్‌బీఐ ఖాతాదారుల డేటా లీక్!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు బిగ్ షాక్ తగిలింది. బ్యాంకు ఖాతాదారుల వివరాలకు సంబంధించిన పోర్టల్‌పై సైబర్ అటాక్ జరిగినట్టు తెలిసింది.ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ధృవీకరించింది. ఎస్బీఐ ఖాతాదారుల వివరాలు డార్క్ వెబ్‌లో దర్శనం ఇచ్చినట్టు సమాచారం. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 3,897 ఎస్బీఐ ఖాతాదారుల వివరాలు ప్రస్తుతం డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. 3,897 కస్టమర్ల పేర్లు, సెల్ నంబర్లు, పుట్టిన తేదీలు, ఈ-మెయిల్, ఇంటి చిరునామాలు, బ్రాంచ్ వివరాలు, CIF ఐడీలు, లోన్ రికార్డులు డార్క్‌వెబ్‌లో బహిర్గతం అయినట్టు ఎస్బీఐ బ్యాంకు ఓ అధికారిక నోట్ విడుదల చేసింది. అయితే, బ్యాంక్ ప్రధాన కార్యకలాపాలకు లేదా లావాదేవీలకు ఎలాంటి అంతరాయం కలగలేదని, పూర్తి దర్యాప్తు కోసం ఒక స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించినట్టు ఎస్బీఐ ప్రకటించింది.