ఓటర్లకు ఎన్నికల సంఘం హెచ్చరిక.. ఈ మెసేజ్‌లు వస్తే జాగ్రత్త!..
ఓటర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ఎన్యుమరేషన్ ఫారం లేదా ఎన్నికల గుర్తింపు కార్డు రిజెక్ట్ అయినట్లు కొందరికి నకిలీ మెసేజ్‌లు పంపుతున్నారు. ఫారంలో వివరాలు తప్పుగా ఉన్నాయని, వాట్సాప్‌లో పంపిన లింక్ ద్వారా మళ్లీ ఫారం పూర్తి చేయాలని సూచిస్తున్నారు. అనంతరం నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా రూ.5 చెల్లించాలంటూ మోసానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్, సీవీవీ, ఏటీఎం పిన్, బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత కాల్స్, మెసేజ్‌ల పట్ల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల సంఘం పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
