International

సైబర్‌ నేరగాళ్ల కొత్త స్కెచ్‌.. విరాళాల పేరుతో ఆన్‌లైన్ దోపిడీ!..

నేపాల్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తున్న దాతల మానవత్వాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు, ఫేక్ క్యూఆర్ కోడ్‌లు సృష్టించి వరద బాధితులకు సాయం చేయండి.. అంటూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఆగస్టు 26న నేపాల్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.. ఈ విపత్తులో చిక్కుకున్న బాధితులను ఆదుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా ఇదే సమయాన్ని సైబర్ ముఠాలు తమకు అనుకూలంగా మలుచుకుని దాతల నుంచి డబ్బులు కాజేసేందుకు సరికొత్త వ్యూహాలకు తెరతీసినట్టు అధికారులు గుర్తించారు.. ఈ క్రమంలో వరద బాధితుల సాయం పేరుతో ఫేస్‌బుక్, వాట్సాప్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, వైబర్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధి వరద బాధితుల సహాయం పేర్లతో నకిలీ పేజీలు, గ్రూపులు సృష్టించారు.