బీజేపీ సర్కారుపై విమర్శలు.. ఆరేళ్ల బాలుడి అరెస్టు (వీడియో వైరల్)
బిహార్ రాష్ట్రంలో విద్యావ్యవస్థలోని సమస్యలు, ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు నిర్వహిస్తున్న ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు.దీంతో అక్కడ తోపులాట జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే 70వ BPSC పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో ఓ ఆరేళ్ల బాలుడు పాల్గొన్నాడు.ఈ సందర్భంగా తమ స్కూల్లో కనీస వసతులు లేవని, టీచర్లు కూడా సరిగ్గా రావడం లేదని విషయాల్ని బాలుడు మీడియా ముఖంగా లేవనెత్తాడు.అలాగే, నేరస్తుల్ని పట్టుకోలేరు కానీ, విద్యాహక్కు కోసం పోరాడుతున్న విద్యార్థులపై చెయ్యి చేసుకుంటారా? అని నిలదీశాడు. ఆ బాలుడిని సామ్రాట్ చౌదరిగా గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తడంతో భారీ బందోబస్తు మధ్య ఆ బాలుడ్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. అతన్ని పోలీసులు రోడ్డు మీద తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
