క్రైమ్
ఢిల్లీలో మరో ‘నిర్భయ’ ఘటన..కదిలే టెంపోలో గ్యాంగ్ రేప్!
దేశరాజధానిలో ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఢిల్లీ పరిసరాల్లో మరో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు హత్య చేశారు దుండగులు. ఇటీవలే కదిలే బస్సులో ఓ మైనర్పై డ్రైవర్, కండక్టర్ దారుణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. తాజా ఘటన మాత్రం అందుకు భిన్నం..కదులుతున్న టెంపోలో 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు సమాచారం. అత్యాచారం చేసిన అనంతరం బాధితురాలిని చంపేసి, శవాన్ని పొలాల్లో విసిరేసినట్టు తెలిసింది. నలుగురు నిందితులు ఈ దారుణానికి పాల్పడగా.. అందులో ముగ్గురు మైనర్లు ఉన్నట్టు తెలిసింది. నిందితులంతా బాధితురాలికి పరిచయస్తులే కావడం గమనార్హం.
