తెలంగాణ
జగిత్యాలలో విషాదం.. నిమజ్జన వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు
రాష్ట్రవ్యాప్తంగా గణపతి నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.అయితే, కొన్ని చోట్ల చెదురుమొదురు ఘటనలు మినహా ప్రశాంతంగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. నెంబర్ల వారీగా జిల్లాల్లో గణపయ్యలు నిమజ్జనం కోసం బారులు తీరాయి. అయితే, యువత నిమజ్జన వేడుకల్లో ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ఊరూరా డీజే సౌండ్స్, బ్యాండ్స్ సప్పుళ్లు మోత మోగుతున్నాయి.ఈ క్రమంలోనే డీజే సౌండ్స్ ధాటికి మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. డ్యాన్స్ చేస్తున్న క్రమంలోనే గుండెపోటు వచ్చినట్టు సమాచారం. తోటి వారు అతనికి కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ఘటన జగిత్యాల పట్టణంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.
