క్రైమ్

Crime : చిన్నారులను అనాథలుగా మార్చిన కొత్త ఇల్లు.. ఏమైందంటే?

సొంతింటి కలను నెరవేర్చుకోవాలని చాలా మంది అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. కొనేటప్పుడు బాగానే ఉన్నా తిరిగి అప్పు చెల్లించే క్రమంలో ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు సర్దుబాటుకాక వాటిని తీర్చడానికి మరల అప్పులు చేస్తున్నారు. దీంతో అప్పులు కాస్త మెడకు ఊరితాడై వేలాడుతోంది. ముందు చూపు లేకుండా చేసిన అప్పులు తల్లిదండ్రులను బలిగొంటుంటే వారి సంతానం అనాథలుగా మారుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. తీసుకున్న అప్పులు చెల్లించలేక దంపతులు ఆత్మహత్య చేసుకోగా.. ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు.