క్రైమ్

మంటల్లో మానవత్వం.. వెనక్కి వెళుతున్న సమాజం!..

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణాలు.. జీవిత విలువలను ప్రశ్నిస్తున్నాయి. మనిషి ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. అతనిలోని మానవత్వం మాత్రం ఎందుకు తగ్గిపోతోందనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఒకప్పుడు కుటుంబం, బంధాలు, ఆప్యాయతలు, పరస్పర గౌరవం మనిషి జీవితానికి పునాదులుగా ఉండేవి. కానీ నేడు చిన్నచిన్న విభేదాలకే హత్యలు, దాడులు, ప్రతీకారాలతో మనుషులు రగిలిపోతున్నారు.

ఆవేశాన్ని, కోపాన్ని అదుపు చేసుకోలేక ప్రాణాలు తీయడమో, లేక ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నారు.. ఈ లోకంలో మనిషి ప్రాణం విలువ కంటే క్షణికావేశం, అహంకారం, డబ్బు, ఆధిపత్యం ముఖ్యమైపోతున్నాయా అనే సందేహం కలుగుతోంది.