క్రైమ్

వ్యక్తి దారుణ హత్య.. చిక్కుముడి విప్పిన మద్యం బాటిల్ మూత

ఓ మర్డర్ కేసును పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించారు. ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితులు అక్కడి నుంచి పరార్ అయ్యారు.అయితే, కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.అయితే, మద్యం బాటిల్ మూత పోలీసుల పనిని మరింత సులభతరం చేసింది. విచారణలో భాగంగా మృతుడి భార్య సుబ్బులు..నిందితుడు గురుప్రసాద్‌కు మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తేల్చారు. వారి ఏకాంతానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న భార్య సుబ్బులు.. తన ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం గురుప్రసాద్ తలపై మద్యం సీసా, బండరాయితో కొట్టి హత్య చేశాడు. ఈ నేరంలో గురు ప్రసాద్‌తో పాటు షరీఫ్‌ కూడా పాలుపంచుకున్నాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై నిందితులు పరార్ అయ్యారు.