సీపీఎస్ రద్దు, బకాయిలు విదుదల చేయాల్సిందే : ఉద్యోగ జేఏసీ మహాధర్నా
రాష్ట్ర ప్రభుత్వంపై మరో ఉద్యమానికి ఉద్యోగ జేఏసీ సిద్ధపడినట్టు తెలుస్తోంది.చాలా కాలంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సర్కార్ ఫెయిల్ అయ్యిందని వారు ఆరోపిస్తున్నారు. అడిగినప్పుడల్లా అదిగో చేస్తాం, ఇదిగో చేస్తాం అని కేవలం ఉత్తమాటలు చెబుతున్నారని, కాలయాపన చేస్తూ తమ సమస్యలు తీర్చడం లేదని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే నేడు ఇందిరాపార్క్ వద్ద ఉద్యోగు జేఏసీ నేతలు మహాధర్నాకు పిలుపునిచ్చారు. సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టినట్టు తెలిసింది. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాచేపట్టామని ఉద్యోగ జేఏసీ నేతలు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ మహాధర్నా కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని, నిరనన ప్రదర్శనలు చేపడతామని పేర్కొన్నారు.
