యూట్యూబ్‌లో చూసి నకిలీ కరెన్సీ ముద్రణ.. 6.78 కోట్లు సీజ్
హైదరాబాద్ మహానగరంలో మరో ఘరానా మోసగాళ్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఫేక్ కరెన్సీని సొంతంగా ముద్రించి చెలామణి చేసేందుకు సదరు నిందితులు స్కెచ్ వేసినట్టు తెలిసింది. అందుకోసం ఏకంగా యూట్యూబ్‌లో చూసి దొంగనోట్లు ఎలా ముద్రించాలో నైపుణ్యం పొందినట్టు సమాచారం. అందుకోసం ముద్రణ సామగ్రిని సైతం సమకూర్చుకుని భారీ ఎత్తున ఫేక్ కరెన్సీని ముద్రించినట్టు తెలిసింది.విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకివెళితే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కుంట్లూరు కేంద్రంగా కొందరు అక్రమార్కులు నకిలీ నోట్లను తయారీ చేసి మార్కెట్లో చెలామణికి వ్యూహ రచన చేశారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి రూ.6.78 కోట్ల నకిలీ నోట్లను తయారు చేశారు.రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలో కారులో వెళ్తుండగా పోలీసుల తనిఖీలు నిర్వహిస్తుండగా.. రూ.8 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు.
