తెలంగాణ

సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో లంచావతారులు.. ఏసీబీకి ఇలా ఫిర్యాదు చేయండి : నారగోని ప్రవీణ్

తెలంగాణలోని చాలా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో విపరీతమైన లంచాలు నడుస్తున్నాయని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా డబ్బులు వసూలు చేయడం, సాయంత్రం లెక్క చూడటం అధికారులకు పరిపాటిగా మారిందని అన్నారు. ఈ విషయం ఏసీబీకి దృష్టికి కూడా వచ్చిందని, అందుకే గత ఒకటి,రెండేళ్లుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు.అవినీతినిరోధక శాఖ (ACB) ప్రతిశాఖ వారీగా లెక్క విడిగా ప్రకటించదన్నారు. కానీ 2025 వార్షిక నివేదిక ప్రకారం మొత్తంగా 199 కేసులు నమోదు అయ్యాయని, 273 మంది అవినీతి అధికారులు అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు.అందులో 157 ట్రాప్ కేసులు ఉన్నాయని చెప్పారు.