తెలంగాణ
అవినీతి జలగలు.. ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్
రాష్ట్రంలో అవినీతి అక్రమార్కులు పట్టుబడుతున్నా కొందరిలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ప్రభుత్వ వేతనాలు తీసుకుంటూనే అక్రమార్జనకు ఎగబడుతున్నారు.ప్రతిరోజూ ఏదో మూల ఏసీబీకి అధికారులు చిక్కుతున్నారు. ఈ విషయం తెలిసినా లంచం తీసుకుంటే పట్టుబడతామేమో అన్న భయం వారిలో కనిపించడం లేదు. మరికొందరైతే పట్టుబడితే దొంగ? లేదంటే దొర అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా మరో అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట సబ్ ట్రెజరీ ఆఫీస్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మెడికల్ బిల్లులు క్లియర్ చేయడానికి జూనియర్ అసిస్టెంట్ రూ.25 వేలు లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. ప్లాన్ ప్రకారం లంచం తీసుకుంటుండగా అధికారిని పట్టుకున్నారు.
