స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

TG : అవినీతి ఖాకీలు!

పోలీసుల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్న ఘటనలు చూస్తే ఎవరైనా ఈ మాట అనకుండా ఉండరు.విధుల్లో నిజాయితీగా పని చేస్తానని ప్రమాణం చేసి ఖాకీ డ్రెస్ వేసుకునే పోలీసులు ఆ శాఖకే మాయని మచ్చ తెస్తున్నారు. విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారు. కొందరు చేస్తున్న ఈ తప్పు వల్ల డిపార్ట్‌మెంట్ మొత్తానికి చెడ్డపేరు వస్తోంది.మంగళవారం హైదరాబాద్‌లోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో రూ.3 లక్షల లంచం తీసుకుంటూ సీఐ కొండల్ రావు ఏసీబీకి పట్టుబడ్డాడు.ఆయనతో పాటు ఓ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.