తెలంగాణ
Cooking Oil Rates: వంట నూనెలపై దిగుమతి సుంకాలు తగ్గించిన కేంద్రం
Cooking Oil Rates: దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ దేశీయ మార్కెట్లలో వంట నూనెల ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ సహా ముడి, శుద్ధి చేసిన పలు రకాల వంట నూనెలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గిస్తూ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 24 అర్ధరాత్రి నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.
