తెలంగాణ

ContemptOfCourt: సీపీ సజ్జనార్‌కు హైకోర్టు షాక్.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ!

 తలాబ్ కట్ట ప్రాంతానికి చెందిన షానవాజ్ ఆలం అనే వ్యక్తి పోలీస్ ఉన్నతాధికారులపై సంచలన ఆరోపణలు చేశాడు. తనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోయినప్పటికీ హైదరాబాద్ భవానీనగర్ ఎస్‌ఐ, సీఐలు తన కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లల్లో కారం చల్లి దారుణంగా చిత్రహింసలకు గురిచేశారంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారుల తీరుపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, బాధ్యులైన అధికారులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడంతో న్యాయం కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపాడు.