బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత నీటితో వంటలు.. విద్యార్థులకు చర్మవ్యాధులు!
తెలంగాణలోని ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీ(basara IIIT) సమస్యలకు నెలవుగా మారింది. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ట్రిపుల్ ఐటీని వేధిస్తున్నది.మొన్నటివరకు నీటి సమస్యతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా కలుషిత నీటి కారణంగా అనారోగ్య సమస్యలు, చర్మ వ్యాధులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. అంతపెద్ద విద్యాలయంలో మెయింటెన్స్ సరిగా లేకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం, నిధుల సమస్య కూడా వెంటాడుతోందని సమాచారం.మౌలిక వసతుల లేమితో విద్యార్థులు చదువు మీద దృష్టి సారించలేకపోతున్నట్టు సమాచారం. నిత్యం అనారోగ్య సమస్యలు, నీటి సమస్యలు వేధిస్తుంటే ఇక వారు చదువు మీద ఎలా దృష్టిసారిస్తారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అసలు అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
