National

Consumer Rights: రూపాయి కోసం రెండేళ్ల న్యాయపోరాటం.. ఐఆర్‌సీటీసీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రయాణికుడు!

Consumer Rights: "ఒక్క రూపాయే కదా.. పోతే పోనీలే" అని సాధారణంగా ఎవరైనా సరే తేలిగ్గా వదిలేస్తారు. కానీ కేరళకు చెందిన ఓ ప్రయాణికుడు మాత్రం ఆ ఒక్క రూపాయి కోసం ఏకంగా రెండేళ్ల పాటు వెనక్కి తగ్గకుండా న్యాయపోరాటం చేశాడు. తన హక్కుల విషయంలో రాజీ పడకుండా కన్స్యూమర్ కోర్టు మెట్లు ఎక్కి, చివరకు రైల్వే సంస్థ ఐఆర్‌సీటీసీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఒక్క రూపాయి బకాయికి బదులుగా ఏకంగా రూ. 3,100 పరిహారం రాబట్టి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.కేరళకు చెందిన సంజయ్ రాజ్ కాడగౌడ్ అనే ప్రయాణికుడు 2024 ఆగస్టు 17న తన రైలు టికెట్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. రూల్స్ ప్రకారం టికెట్ రద్దు చేసిన తర్వాత తిరిగి రావాల్సిన రీఫండ్ అమౌంట్‌లో ఐఆర్‌సీటీసీ ఒక్క రూపాయి తక్కువగా జమ చేసింది. కేవలం రూపాయే అయినా, సర్వీస్ లోపం విషయంలో మౌనంగా ఉండకూడదని సంజయ్ డిసైడ్ అయ్యారు. వెంటనే ఐఆర్‌సీటీసీ తీరును సవాలు చేస్తూ కన్స్యూమర్ కమిషన్‌లో కంప్లైంట్ చేశారు.