తెలంగాణ

ఎస్ఐఆర్ మాటున కోటి ఓట్లు తొలగించే కుట్ర : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ఎస్ఐఆర్ మాటున ఒక కోటి ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. తమ వ్యతిరేక ఓట్లను గుర్తించేందుకు బీజేపీ ప్రత్యేకంగా ఏజెన్సీలను పెట్టుకుందని, 2009 నుంచి ఓటింగ్ సరళని పరిశీలించి వారికి అనుకూల ఓట్లను ఉంచుకుని, వ్యతిరేక ఓట్లను డిలీట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవస్థ సిద్ధమవుతోందని గ్రహించి ‘ఎస్ఐఆర్’ రూపంలో కొత్త కుట్రకు తెరలేపారని అన్నారు. తెలంగాణలో దాదాపు కోటి ఓట్లు తొలగిస్తున్నా బీఆర్ఎస్ వాళ్లు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. సోమవారం రవీంద్రభారతిలో ప్రముఖ రైతు నేత సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో సెక్యూలర్ శక్తులు సమిష్టిగా మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.