రాజకీయాలు

కేసీఆర్ గతే కాంగ్రెస్‌కు పడుతుంది : బండి సంజయ్

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి గతంలో మాజీ సీఎం కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్ జోస్యం చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావును హౌస్ అరెస్ట్‌పై చేయడంపై బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించేందుకు, నిరసన తెలిపేందుకు వెళ్తున్న నాయకులను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. దాడులు చేసేవారిని కాపాడటమేనా? కాంగ్రెస్ చెబుతున్న 'ఇందిరమ్మ రాజ్యం'? అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఇంటిని ధ్వంసం చేసిన నిందితులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని నిలదీశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.