తెలంగాణ

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. రాంచందర్ రావు హౌస్ అరెస్టు

రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పార్టీ నడుమ మాటల యుద్ధం నడుస్తోంది.అది కాస్త చేజారిపోయి పార్టీ ఆఫీసులు, నేతల ఇళ్ల మీద దాడుల వరకు వెళ్లింది.నిన్న నల్గొండ జిల్లాలో బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. అదే విధంగా, నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలిపారు. అనంతరం ఆఫీసు మెయిన్ డోర్ మీద నల్ల ఇంకు చల్లారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ శ్రేణుల దాడులను నిరసిస్తూ బీజేపీ ఇవాళ నల్గొండ టూర్‌కు పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావును ముందస్తుగా హౌస్ అరెస్టు చేసినట్టు సమాచారం. తార్నాక‌లోని నివాసంలో రామచంద్ర రావును పోలీసులు గృహ‌ నిర్భందం చేశారు.