Congress MLC Candidates: కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పూర్తి బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Congress MLC Candidates: తెలంగాణలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల సమరానికి కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. సాధారణ ఎన్నికల మాదిరిగా కాకుండా, విద్యావంతులు మాత్రమే ఓటు వేసే ఈ నియోజకవర్గాల్లో పార్టీ సాంప్రదాయ రాజకీయ నాయకులను పక్కనపెట్టింది. అత్యున్నత విద్యార్హతలు, అంతర్జాతీయ కార్పొరేట్ అనుభవం, లీగల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఇద్దరు నేతలను బరిలోకి దించింది. ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్‌తో సమరానికి సిద్ధమైన ఆ ఇద్దరు అభ్యర్థుల పూర్తి ప్రొఫైల్స్, వారి రాజకీయ నేపథ్యాలు ఇవే.హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానానికి ఎంపికైన సామ రామ్మోహన్ రెడ్డికి విద్యార్థి దశ నుంచే బలమైన పోరాట నేపథ్యం ఉంది.
విద్యార్హతలు & వృత్తి: ఇంజినీరింగ్ (బీటెక్) పూర్తి చేసిన అనంతరం ఎల్ఎల్బీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీసింగ్ లాయర్‌గా కొనసాగుతున్నారు. పలు కీలక రాజ్యాంగపరమైన అంశాలు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, పార్టీ న్యాయ విభాగం తరఫున వాదనలు వినిపించిన అనుభవం ఆయన సొంతం.
