National
మైక్ కట్ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే విధ్వంసం.. సౌండ్ ఆపరేటర్లపై దాడి!
ప్రసంగం మధ్యలో తన మైక్ కట్ చేశారని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే స్టేజీ మీద రచ్చ రచ్చ చేశారు.అంతేకాకుండా కుర్చీలతో సౌండ్ ఆపరేటర్ మీద దాడికి ప్రయత్నించారు.ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో జరిగింది. నిన్న ఉదయం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జౌల్జీ బీ జాతరను ప్రారంభించి, తన ప్రసంగం అనంతరం వేదికపై నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత స్థానిక ధార్చులా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ ధామి మాట్లాడేందుకు వేదికపైకి వచ్చారు.సీఎం పుష్కర్ సింగ్ తన ప్రసంగం వినకుండానే వెళ్లిపోయారని హరీష్ ధామి విమర్శలు ప్రారంభించారు. ఆ వెంటనే మైక్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో తనను మాట్లాడకుండా అడ్డుకునేందుకే కావాలని మైక్ ఆపేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు.
