తెలంగాణ
కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి వివేక్!..
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేటీఆర్ నాయకత్వంపై విమర్శలు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయనపై నిప్పులు చెరిగారు. కేటీఆర్ ఒక ఫెయిల్డ్ లీడర్ అని.. ఆయన అసమర్థత వల్లే అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందని ధ్వజమెత్తారు. పదేండ్ల కేసీఆర్ పాలన అంతా అవినీతిమయమైందని విమర్శించారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
