క్రైమ్

న్యూడ్ పిక్స్ తీసి వేధిస్తున్న కాంగ్రెస్ నేత.. మహిళ ఆత్మహత్యాయత్నం!

అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు మహిళను వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. ఆమె న్యూస్ ఫొటోస్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు సమాచారం.ఈ ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చర్యలు తీసుకోకుండా సదరు మహిళనే బెదిరింపులకు గురిచేస్తున్నట్టు సమాచారం.వివరాల్లోకివెళితే.. బక్కమంతులగూడెనికి చెందిన ఓ మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నేత చింతారెడ్డి విజయభాస్కర్ ఆమె ఇంట్లోకి చొరబడినట్టు సమాచారం.ఆమె బట్టలు మార్చుకుంటుండగా తన ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీసి ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. తాను అడిగింది ఇవ్వకపోతే ఆమెకు చెందిన న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బాధితురాలిని వేధింపులకు గురిచేస్తున్నట్టు సమాచారం.