రాజకీయాలు

మేం చేసింది కూడా కాంగ్రెస్ చేయడం లేదు : హరీశ్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్స్ కూడా అమలు కావడం లేదని శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్స్ కూడా అమలు కావడం లేదని శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మర్చిపోయిందని విమర్శించారు.

బీఆర్ఎస్ టైంలో చాలా హామీలు నెరవేర్చామని, ఎన్నో కొత్త పథకాలు అమలు చేశామని.. కనీసం వాటిని కూడా కాంగ్రెస్ సర్కార్ కొనసాగించడం లేదని మండిపడ్డారు. బుధవారం ట్రైబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ బిజినెస్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఈ సందర్బంగా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో గిరిజనుల హక్కుల కోసం కొట్లాడతామని చెప్పారు.రు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.