తెలంగాణ
తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్.. బండి సంజయ్ తీవ్ర విమర్శలు!
తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని భూముల నిర్వహణపై బండి సంజయ్ పలు ప్రశ్నలు గుప్పించారు. కొత్తగా పంపిణీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి ఫోటో వేసుకుంటూ, అసలు బియ్యం ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ఎందుకు పెట్టలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కేవలం ఒక తుమ్ముకే ఊడిపోయేంత బలహీనమైన పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటూ ఎద్దేవా చేశారు.
