తెలంగాణ
కొండా సురేఖ బర్తరఫ్.. చిన్నారెడ్డిపై వేటు.. గద్వాల విజయలక్ష్మికి పదవి
Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ ఎసిసోడ్ కు ఎండ్ కార్డ్ పడింది. ఆమెతో రాజీనామా చేయిస్తారా? బర్తరఫ్ చేస్తారా? అన్న ఉత్కంఠకు తెర దించింది కాంగ్రెస్ హైకమాండ్. కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని గవర్నర్ కు సిఫారసు లేఖ పంపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం లోక్ భవన్ నుంచి అధికారిక ఉత్వర్వులు వెలువడనున్నాయి. రాజీనామా చేసేందుకు కొండా సురేఖ అంగీకరించకపోవడంతో బర్తరఫ్ చేయాలని హైకమాండ్ డెసిషన్ తీసుకుంది.
