తెలంగాణ

కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి: కిషన్ రెడ్డి

 ప్రజాస్వామ్య హక్కులు, నిరసనల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా నిరసనలు, మార్చ్‌లు చేసుకునేందుకు అనుమతిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం విపక్ష బీజేపీ నేతల గొంతును ఉక్కుపాదంతో అణచివేస్తోందని మండిపడ్డారు. ఒకే దేశంలో రెండు విభిన్న రాజకీయ విధానాలను అవలంబిస్తూ కాంగ్రెస్ పార్టీ తన ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేసుకుంటోందని దుయ్యబట్టారు.