National
Congress: రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అర్హత ఉందా??..
రాహుల్ గాంధీ కెరీర్ ప్రారంభంలో రాజకీయాల్లో పార్ట్-టైమ్ లీడర్‌గా వ్యవహరించారని, కీలక సమయాల్లో విదేశీ పర్యటనలకు వెళ్లేవారని విమర్శలు ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ ధోరణిలో మార్పు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక భారత ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా ప్రధాని పీఠాన్ని అధిరోహించాలంటే ఎన్నికల్లో స్పష్టమైన ప్రజాదరణ, లోక్‌సభలో మెజారిటీ సాధించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ తన గత బలహీనతలను అధిగమిస్తూ, ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాతో ప్రజలను ఎంతవరకు మెప్పించగలరనే దానిపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు..
