తెలంగాణ

congress: 22A నిషేధిత జాబితాపై ఉద్యమానికి సిద్దం.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన హరీష్ రావు!..

తెలంగాణలో పొలిటికల్ వార్ పీక్ స్టేజీకి చేరుకుంటుంది. 22A నిషేధిత జాబితాపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా ప్రతిపక్షాలు ఈ అంశంపై ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి, హేమానగర్ కాలనీలను 22A జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ నిర్వహించిన సమావేశంలో ఆయన బాధితులకు అండగా నిలిచారు. మధ్యతరగతి ప్రజలు జీవితాంతం కష్టపడి, అప్పులు చేసి నిర్మించుకున్న ఇళ్లను 22A జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ఇళ్లు అమ్ముకోలేక, బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారని హరీశ్ రావు ఆరోపించారు.