రాజకీయాలు
కాంగ్రెస్లో కయ్యం.. ఎమ్మెల్సీ మల్లన్నకు బీర్ల ఐలయ్య వార్నింగ్
కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య కయ్యాలు, వివాదాలు సర్దుమనగడం లేదు. పదవులు రాని వారంతా సొంత పార్టీ, ఏకంగా సీఎం రేవంత్, మంత్రులను కార్నర్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొందరైతే పేర్లు మెన్షన్ చేయకుండా పరోక్షంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీ మల్లన్న, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నడుమ వివాదం నెలకొంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఓ కులాన్ని టార్గెట్ చేస్తూ మల్లన్న మాట్లాడటంపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మల్లన్న ఒక బీసీ ద్రోహి అంటూ మండిపడ్డారు.‘బీసీ ద్రోహి మల్లన్న, నీ నడ్డి విరుగుడు ఖాయం. మొగోనివైతే నీ పార్టీ బీ ఫామ్ మీద పోటీ చేయ్. నీకు డిపాజిట్ వస్తే నేను ఆలేరులో పోటీ చేయను’ అంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సవాల్ విసిరారు.
