National
అభిజీత్ దీప్కే, సీజేపీ ప్రతినిధులకు కండిషనల్ బెయిల్..
'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నేతలు అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోశ్ రంకాలకు ఆదివారం ఉదయం షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. రాబోయే ఒక సంవత్సరం పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడమనే షరతుపై ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్‌స్టేషన్‌లోని ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చారు. మున్ముందు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు కూడా చేసినట్టు సమాచారం. కాగా, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండుతో నిన్న జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు సీజేపీ పిలుపునివ్వగా.. వివిధ పార్టీల నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్దఎత్తున హాజరయ్యారు. సీజేపీ ప్రతినిధులను మందస్తు అరెస్టులు చేసిన విషయం తెలిసిందే.
