తెలంగాణ

వరంగల్ ఎంజీఎంలో ఊడిన పెచ్చులు.. నిరసనకు దిగిన మాజీ ఎమ్మెల్యేపై పోలీసుల దాష్టీకం!

 వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రి వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రిలోని ఆర్‌ఐసీయూ (RICU), ఫిజియోథెరపీ విభాగాల్లో పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటన తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఆ సమయంలో రోగులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ, ప్రభుత్వ ఆసుపత్రులలో భద్రతా లోపాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల పరిస్థితిని, ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకున్నారు.