International
‘రియల్ హీరో’ స్మిత్ మచ్చార్ ఆరోగ్యంపై ఆందోళన.. డాక్టర్లు ఏం చెప్పారంటే?
ఫ్లైదుబాయ్ విమానంలో ఒమనీ కో-పైలట్ దాడి నుంచి విమానాన్ని సురక్షితంగా కాపాడిన భారతీయ పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్చార్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాక్పిట్ గొడ్డలితో కో-పైలట్ జరిపిన దాడిలో మచ్చార్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనకు యూఏఈలోని అబుధాబిలో ఉన్న మిలిటరీ ఆసుపత్రి నిపుణులు అత్యవసర వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పుర్రెలో తీవ్ర ఫ్రాక్చర్ ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు.
