క్రైమ్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. తనిఖీల్లో నకిలీ టికెట్, బుల్లెట్లు స్వాధీనం!

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుసగా చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. విమానాశ్రయంలో నిర్వహించిన నిత్య తనిఖీల్లో ఒక ప్రయాణికుడి వద్ద నకిలీ విమాన టికెట్‌ను, మరొక ప్రయాణికుడి లగేజీలో సజీవ బుల్లెట్లను సీఐఎస్ఎఫ్ (CISF) భద్రతా సిబ్బంది గుర్తించారు. రెండు వేర్వేరు మార్గాల్లో ప్రయాణించాల్సిన ఈ ప్రయాణికులను అధికారులు తక్షణమే అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఒక ప్రయాణికుడి టికెట్‌ను పరిశీలించగా సెక్యూరిటీ అధికారులకు తీవ్ర అనుమానం వచ్చింది.