తెలంగాణ

అర్ధరాత్రి గురుకులంలో కలకలం.. ఆస్పత్రిలో 14 మంది విద్యార్థినులు

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బాలబాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మొన్నటివరకు ఫుడ్ పాయిజన్ ఘటనలు గురుకులాల్లో రిపీట్ అవ్వగా.. తాజాగా మరో సమస్య వారిని వెంటాడుతోంది. అపరిశుభ్రత, నీటి సమస్యలకు తోడు కొత్తగా ఎలుకల భయం విద్యార్థినులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నట్టు తెలిసింది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎలుకలు విద్యార్థినులను కరిచాయి.అర్ధరాత్రి విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో 14 మందిని ఎలుకలు కరిచినట్లు సమాచారం. విద్యార్థినుల చేతులు, కాళ్లపై ఎలుకలు కరవడంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.రాత్రంతా విద్యార్థినులు ఏడుస్తూ కూర్చున్నట్టు సమాచారం.