రాజకీయాలు

సీఎం సోదరుడిపై కామెంట్స్.. ఎంపీ చామలపై అధిష్టానం ఆగ్రహం!

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి కేటాయించిన రూ.వందల కోట్ల విలువైన భూమి విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.రూ.లక్ష పెట్టుబడితో స్థాపించిన టెస్సరాక్ట్ కంపెనీకి సీఈవో తాను అని సీఎం సోదరుడు కొండల్ రెడ్డి పోస్టు పెట్టడం, ఒక్క ఉద్యోగి కూడా లేని ఆ కంపెనీకి రూ. 135 కోట్ల విలువ చేసే 5 ఎకరాలు కేటాయించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మన్నె క్రిశాంక్ తీవ్ర ఆరోపణలు , విమర్శలు గుప్పించారు.దీనిపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘కొండల్ రెడ్డి సంపాదించుకోవద్దా?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి. రూ.135 కోట్ల భూస్కాం విషయంలో రేవంత్ సోదరుడికి కాంగ్రెస్ ఎంపీ చామల మద్దతుగా మాట్లాడటం పొలిటికల్ చర్చకు దారితీసింది. ‘