తెలంగాణ

కరువొచ్చిన తగ్గేదెలే.. బీర్లకు కొరత రానివ్వం : మంత్రి జూపల్లి కృష్ణారావు

రాష్ట్రంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొన్నాయి. జలాశయాల్లో ఆశించిన మేర నీటి నిల్వ లేదు. గతంతో పోలిస్తే ఈసారి ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తెలంగాణలో 17 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం గణనీయంగా పడిపోయింది.సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు కూడా అడుగుంటుకుపోయాయని తెలుస్తోంది. దిలాఉంటే రైతులు, ప్రజల అవసరాలను పట్టించుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీర్ల కంపెనీలకు నిత్యం నీటి సరఫరా చేసేందుకు ఓకే చెప్పింది. కరువు పరిస్థితులు ఉన్నా బీర్ల తయారీ కోసం కంపెనీలకు శ్రీశైలం నుండి నీటిని ఇస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తాజాగా ప్రకటించారు.బీర్ల ఉత్పత్తికి కొరత రాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు.ఇందుకోసం శ్రీశైలం నుండి నీటిని సాధ్యమైనంత వరకు వాడుకుంటామని చెప్పారు.