తెలంగాణ

ట్రాఫిక్ చలానాలు వసూళ్ల దందా కాదు.. ట్రాఫిక్ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం!

హైదరాబాద్ మహానగరంలో వాహనం బయటకు తీయాలంటేనే సామాన్య ప్రజలు భయపడిపోయే పరిస్థితులు దాపురించాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పేరుతో రోడ్లపై వాహనదారులను నిలిపివేసి, వేలకు వేలు జరిమానాలు వసూలు చేయడం నిత్యకృత్యంగా మారింది. చలానాలు చెల్లించలేదనే సాకుతో జప్తు చేయడం, ఒరిజినల్ ఆర్సీ పత్రాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ వేధింపుల పర్వంపై దాఖలైన పిటిషన్లను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ హైకోర్టు, ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.