తెలంగాణ
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. 11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగి ప్రజలను గజగజ వణికిస్తోంది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న చల్లని పొడి గాలుల ప్రభావంతో ఆదివారం రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా పడిపోయాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలంలో 11.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 13.4 డిగ్రీలకు చేరడంతో నగరవాసులు చలికి వణికిపోతున్నారు.
