National
Cm Vijay : ‘నీట్, ఎఫ్సీఆర్ఏ’కు వ్యతిరేకం.. విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నీట్, ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు-2026కు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. ప్రతిపక్ష డీఎంకే సైతం మద్దతు తెలిపింది.'నీట్' విధానం వద్దని, 12వ తరగతి (ఇంటర్మీడియట్) మార్కుల ఆధారంగానే వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని విజయ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. నీట్ వలన గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఖరీదైన కోచింగ్ సెంటర్ల వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం పడుతోందని విజయ్ సర్కార్ ఆరోపించింది.
