ఎమ్మెల్యేలకు కార్లపై వెనక్కి తగ్గిన సీఎం విజయ్.. కారణం ఇదేనా?
తమిళనాడు సీఎం విజయ్ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలు అందరికీ కొత్త వాహనాలు ఇస్తామని ప్రకటించిన సీఎం అంతలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఇదివరకు ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసిన వారికి సైతం లగ్జరీ కార్లు ఇస్తామని సీఎం ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టీవీకే చీఫ్, సీఎం విజయ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలిసింది.ప్రస్తుతం తమిళనాడు శాసనసభలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.అందులో టీవీకే పార్టీ నుంచి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టిన వారు చాలా మందే ఉన్నారు. వారితో పాటే డీఎంకే, ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు ఎన్నికలైన వారు కూడా ఉన్నారు.వీరికి నూతన వాహనంతో పాటు ఫ్యూయల్,మెయింటెన్స్ కోసం నెలకు రూ.1 లక్ష అలవెన్స్ ఇస్తామని ముందుగా సీఎం విజయ్ ప్రకటన చేశారు.
