రేవంత్ సన్నిహితుడు నన్ను గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నాడు : మహిళా వ్యాపారవేత్త!
రాష్ట్రంలో మహిళలకు వేధింపులు ఆగడం లేదు.రంగం ఏదైనా మహిళలు తమ అభ్యున్నతి కోసం చేసే పోరాటంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని తెలుస్తోంది.ఉద్యోగాలు చేసే దగ్గర మాత్రమే కాకుండా ఇంటా,బయట, ఎక్కడపడితే అక్కడ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు తనను వేధించినట్టు ఓ మహిళా వ్యాపారవేత్త సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టింది. ‘సాయం కోరితే సీఎం సన్నిహితుడు గెస్ట్ హౌస్‌కు రమ్మని పిలిచాడు. అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వమని అడిగితే, సీఎంకు సన్నిహితుడైన ఒక వ్యక్తి గెస్ట్ హౌస్‌కు రావాలని పిలిచాడు’ అంటూ కె.శోభా రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరి పేర్లు చెప్పలేను కానీ ఇలాంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ తన పోస్టులో పేర్కొంది.
