తెలంగాణ

నేడు ‘టిమ్స్’ ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం రేవంత్..

హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్ నగర్‘టిమ్స్’ ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆయన వెంట ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహా, ఇతర మంత్రులు, ముఖ్య అధికారులు సైతం పాల్గొంటారని సమాచారం. టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం పూర్తయి చాలా రోజులు గడుస్తున్నా ప్రారంభం మాత్రం కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే.