తెలంగాణ

రేవంత్ ఒకలా? పొంగులేటి మరొకలా? : ఎంపీ రఘునందన్ రావు

రాష్ట్రంలో 22 ఏ నిషేధిత భూముల అంశంపై మెదక్ బీజేపీ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు తాజాగా స్పందించారు.22 ఏ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకలా? రెవెన్యూ,గృహ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరొకలా? మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారగానే రెవెన్యూ చట్టాలు మార్చడం సరికాదని, దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉండాలని రఘునందన్ రావు స్పష్టంచేశారు. 22ఏ అంశం మీద తెలంగాణ రైతాంగం, పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి అక్రమాలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 22ఏ మీద మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ రెడ్డి తలోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. 22ఏ మీద మాట్లాడితే బీఆర్ఎస్,బీజేపీ ఒక్కటే అని మంత్రి పొంగులేటి అనడం సరికాదన్నారు.