తెలంగాణ

సీఎం రేవంత్‌రెడ్డి లండన్ టూర్ ముగింపు.. సాయంత్రం ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను ముగించుకుని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. యూకే పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని, అక్కడి నుంచి అమెరికా వెళ్లాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఆయన ప్రతిపాదిత యూఎస్ టూర్‌కు రాజకీయ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే, విదేశాంగ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికా పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, విద్యాపరమైన అవకాశాలపై కేంద్రం మోకాలడ్డడంపై లండన్ పర్యటనలోనే సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.