తెలంగాణ

రేషన్ కార్డు ప్లాస్టిక్ వస్తువు కాదు, పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవం

రేషన్ కార్డు కేవలం ప్లాస్టిక్ వస్తువు కాదు, ఉచితంగా బియ్యం తెచ్చి పెట్టే సాధనం కాదు.. పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదలు ఎవరి ముందు చెయ్యి చాచి నిలబడాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదనే సంకల్పంతో.. దేశంలో పేదలకు నిత్యవసర వస్తువులు పంచేందుకు రేషన్ షాపులు కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. సంగారెడ్డిలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడారు.