తెలంగాణ

తాగేందుకు చుక్క నీరు కూడా దొరకదు- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Elnino: ఎల్ నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్ నినో కారణంగా చాలా దారుణమైన పరిస్థితులు చూడబోతున్నామన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కరువు మనల్ని కబలిస్తోందన్నారు. కరువుపై 6 నెలలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. తెలంగాణలోనే కాదు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులోనూ కరువు ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో కరువు పరిస్థితి ఉందన్నారు.

తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి రాబోతోందని హెచ్చరించిన సీఎం రేవంత్.. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అసవరం ఉందని స్పష్టం చేశారు. సాగునీరు సంగతి దేవుడెరుగు.. తాగునీరే దొరకని పరిస్థితి వస్తుందన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేయకుంటే ఈ కరువును ఎదుర్కోలేమన్నారు. కరోనా ఎంతటి విపత్తో.. ఇప్పుడు ఎల్ నినో కూడా అంతే విపత్తు అని హెచ్చరించారు.