క్రీడలు

మెస్సీ రిటైర్మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ పోస్టు

Cm Revanth: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు. దాంతోపాటు మెస్సీతో తాను కలుసున్న అరుదైన ఫొటోను షేర్ శారు రేవంత్ రెడ్డి.

ప్రియమైన మెస్సీ అంటూ తన సందేశాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఎంతగానో ఉత్తేజపరిచారు, మీ అద్భుతమైన ఆటతీరుతో మమ్మల్ని అలరించారు అని మెస్సీని ప్రశంసించారు. మీరు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని కితాబిచ్చారు. హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ గ్రౌండ్ లో మీతో కాసేపు గడిపిన క్షణాలను గొప్ప గౌరవంగా భావిస్తున్నా అని రేవంత్ పేర్కొన్నారు. ఏది ఏమైనా మెస్సీ లేని ఫుట్‌బాల్ మునుపటిలా ఉండదని కాస్త ఎమోషనల్ అయ్యారు. మీకు ఇదే మా వీడ్కోలు, మీ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి" అని తన పోస్టులో ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.